Video: ట్రాక్ పక్కనే గజరాజు.. అప్రమత్తతతో రైలును ఆపిన లోకోపైలెట్లు..!
Elephant Save: తాజాగా ఓ రైలు లోకోపైలెట్లు మాత్రం ఓ గజరాజును రక్షించారు. వాళ్లు అప్రమత్తంగా ఉండి ఉండకపోతే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయేదే.

కోల్కతా: ప్రమాదవశాత్తు మనుషులు, పశువులు రైలుకింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి చాలాసార్లు వింటుంటాం. అడవుల్లో కూడా తరచూ మూగజీవాలు రైళ్ల కిందపడి మరణిస్తుంటాయి. ఇలా ఏనుగులు, సింహాలు, పులులు, రైనోలు రైళ్లకింద పడి చనిపోయిన ఘటనలు అప్పుడప్పుడు పత్రికల్లో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా ఓ రైలు లోకోపైలెట్లు మాత్రం ఓ గజరాజును రక్షించారు. వాళ్లు అప్రమత్తంగా ఉండి ఉండకపోతే ఆ ఏనుగు కూడా ప్రాణాలు కోల్పోయేదే.
ఇంతకూ ఏం జరిగిందంటే.. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్ ఉత్తర బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి ట్రాక్ పక్కన ఓ ఏనుగు నిలబడి ఉంది. దూరం నుంచి దాన్ని గమనించిన లోకోపైలెట్లు వెంటనే రైలును నిలిపేశారు. ఏనుగు ట్రాక్ దగ్గరి నుంచి అడవిలోపలికి వెళ్లేవరకు వేచిచూసి ఆ తర్వాత రైలును ముందుకు పోనిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అలీపూర్ద్వార్ డివిజన్ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు.
ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి లోకో పైలెట్లపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సమయానికి అప్రమత్తంగా వ్యవహరించి ఏనుగు ప్రాణాలను కాపాడారంటూ వారిని మెచ్చుకుంటున్నారు. అటు రైల్వే శాఖ కూడా ఇద్దరు లోకో పైలెట్లను అభినందించింది.
While working 03150Dn KanchanKanya Exp spl at 17.45 hrs today, Alert LP Sri D.Dorai & ALP Sri P. Kumar noticed One Tusker adjacent to track at KM 72/1 between Nagrakata-Chalsa & applied Emergency brake to control the train & save it. @RailNf@RailMinIndia @wti_org_india pic.twitter.com/TVyXt8HY9H
— ALIPURDUAR DIVISION (@drm_apdj) August 25, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

