బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది ( Building collapse ). అందరూ చూస్తుండగానే భవనం కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ఈ భవనం ముందే ఒకవైపు వంగిపోవడంతో స్థానికులు ఇచ్చిన ససమాచారం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అందరినీ ఖాళీ చేయించారు. ఆ తర్వాత కాసేపటికే భవనం కుప్పకూలింది.
అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఏ ఒక్కరూ గాయపడటం గానీ జరిగి ఉండదని అధికారులు చెబుతున్నారు. కానీ, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందంటున్నారు. భవనం కూలిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా ఒకసారి వీక్షించండి.
#WATCH | Karnataka: A building collapsed in Bengaluru today, no casualties or injuries reported so far. Fire Department had evacuated the building before it collapsed. Officials rushed to the spot. Details awaited. pic.twitter.com/oWmUBsFm6E
— ANI (@ANI) September 27, 2021