జమ్ముకశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు.. మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రహదారి.. వీడియో
Snow clearance | ఈ శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత
శ్రీనగర్: ఈ శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తున్నది. దాంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ముకశ్మీర్లో ఎక్కడపడితే అక్కడ మంచు మేటలు వేస్తున్నది.
తాజాగా శ్రీనగర్-లేహ్ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర మంచులో కూరుకుపోయింది. విపరీతంగా కురియడంతో ఆ రోడ్డుపై మంచు పెద్దఎత్తున పేరుకుపోయింది. దాంతో ఆ రోడ్డు వెంబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డును క్లియర్ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. డోజర్ల సాయంతో రహదారిపై మంచును క్లియర్ చేస్తున్నారు.
బీకన్ ఆఫ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఈ స్నో క్లియరెన్స్ పనుల్లో పురోగతి కనిపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి, మళ్లీ మంచు కురియకపోతే ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
#WATCH | J&K: Snow clearance of Srinagar-Leh highway in progress by project Beacon of Border Roads Organisation pic.twitter.com/abpfJznGtS
— ANI (@ANI) December 30, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

