అహ్మదాబాద్ : బోరుబావిలో పడిపోయిన బాలుడిని భారత ఆర్మీ విజయవంతంగా కాపాడింది. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఏడాదిన్నర వయసున్న బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఆరోగ్యశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
In a complex & swift rescue operation last night #INDIANARMY extricated an 18 month old child from 300 ft borewell submerged in water at Dhrangadhra #Gujarat. Presence of mind & innovative methods led to saving of the precious life.#KonarkCorps#HarKaamDeshKeNaam pic.twitter.com/ApOunlVY0g
— Southern Command INDIAN ARMY (@IaSouthern) June 8, 2022
దూదాపూర్ గ్రామంలో ఈ నెల 7న రాత్రి 8 గంటల సమయంలో ఘటన చోటు చేసుకున్నది. తల్లిదండ్రులు పొలంలో కూలీ పనులు చేసుకుంటుండగా.. ఏడాదిన్నర వయసున్న బాలుడు శివం ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలుడు బోరుబావిలో పడిపోయాడని ధృంగాద్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా పరిపాలన అధికారులు స్థానిక విపత్తు నిర్వహణ సెల్, అహ్మదాబాద్‌లో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు చేరుకున్నాయి.
Love and Care by #IndianArmy. After rescue of one and half year old child #Shivam from a narrow borewell in Dudhapur village of Dhrangadhra Taluka, approx 20 km away from #Military Station.@IaSouthern @adgpi @indiatvnews @DefenceMinIndia pic.twitter.com/s081Apd8gh
— Manish Prasad (@manishindiatv) June 9, 2022
అయితే, స్థానిక యంత్రాంగం ఆర్మీ, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుల సహాయాన్ని కోరింది. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్మీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న 40 నిమిషాల్లోనే బాలుడు సురక్షితంగా కాపాడినట్లు అధికారి తెలిపారు. ఆ తర్వాత బాలుడిని చికిత్స కోసం జిల్లా సివిల్ ఆసుపత్రికి రెఫర్ చేయగా.. పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆర్మీ, పోలీసులు చాకచక్యంగా మెటల్ హుక్‌ను మనీలా రోప్‌కు కట్టి.. బోరు లోపలికి పంపారు. ఆ తర్వాత బాలుడి టీషర్ట్‌ను హుక్ సహాయంతో పట్టుకొని మెల్లగా పైకి తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు.