షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. చెట్లు కూలిపోయాయి. నివాసాలు ధ్వంసమయ్యాయి. షిమ్లా ఏరియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన స్పెషల్ టీమ్స్ శిథిలాల నుంచి 16 మృతదేహాలను వెలికితీశాయి.
షిమ్లాలోనేగాక ఇంకా చాలాచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయని, రోడ్ల వెంట చెట్లు కూలాయని ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని, నివాసాలు కూలిపోయి నిరాశ్రయులైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాల్లో రికార్డయ్యాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.
#WATCH | Himachal Pradesh: Drone visuals of rescue operations that are underway in Shimla after heavy rains battered several areas pic.twitter.com/p0IyUIuvkr
— ANI (@ANI) August 19, 2023