Heavy rains : ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy rains) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెగకుండా వర్షాలు కురుస్తుండటంతో జనం అల్లాడుతున్నారు. కుండపోత వర్షాల కారణంగా వరదలు (Floods) పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), పంజాబ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో విపరీతంగా వానలు పడుతున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ జిల్లాలోని కాలనీలకు కాలనీలే, ఊర్లకుఊర్లే వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. కొన్ని చోట్ల ఇళ్లలోకే వరదనీరు చేరింది. దాంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు పంపేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Jammu and Kashmir: Heavy rains submerge large parts of Anantnag. pic.twitter.com/aATsiQfQ6P
— ANI (@ANI) September 3, 2025