Heavy rain : పశ్చిమబెంగాల్ (West Bengal) లో భారీ వర్షం (Heavy rain) కురుస్తోంది. ఇక రాజధాని కోల్కతా (Kolkata) లో ఎడతెరపిలేకుండా కుండపోత వర్షం పడుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలువడంతో తటాకాలను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయపెట్టే పరిస్థితి కూడా లేదు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూ నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని సౌతర్న్ అవెన్యూ ఏరియాలో భారీగా వరద నీరు చేరింది. పలు అపార్టుమెంట్ సెల్లార్లలో నీరు నిలిచిపోయింది. సెల్లార్లలో వాహనాలు నీట మునిగిపోయాయి. దాంతో ఆయా అపార్టుమెంట్లలోని జనాలు కిందకు దిగలేని పరిస్థితి నెలకొంది. కోల్కతాలోని సౌతర్న్ అవెన్యూ ఏరియాలో భారీగా వరదనీరు చేరిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Kolkata, West Bengal | Heavy rain causes waterlogging in several parts of Kolkata
(Visuals around Southern Avenue area) pic.twitter.com/SHWGhIsCbm
— ANI (@ANI) September 23, 2025
#WATCH | Kolkata, West Bengal | Heavy rain causes waterlogging in several parts of Kolkata
(Visuals from Jadavpur and Baghajatin areas) pic.twitter.com/M916A1dRwR
— ANI (@ANI) September 23, 2025