Sonia Gandhi : లోక్సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మెచ్చుకున్నారు. ఇవాళ పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సోనియాగాంధీని.. ప్రియాంకాగాంధీ ప్రసంగంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రశ్నించగా.. ఆమె ‘ఎక్సలెంట్’ అని స్పందించారు. ఆ తర్వాత తన కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన ప్రియాంకాగాంధీ.. ఇవాళ లోక్సభలో తొలిసారి ప్రసంగించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. దేశ పౌరులకు రక్షణ కవచం లాంటి రాజ్యాంగాన్ని బద్ధలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని విమర్శించారు.
కులగణన విషయంలో ప్రభుత్వ తీరుపై కూడా ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. కులగణనపై ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ నేతలు తరచూ మాజీ ప్రధాని నెహ్రూ పేరెత్తడంపై కూడా ప్రియాంకాగాంధీ స్పందించారు. దేశానికి సంబంధించిన ప్రతి విషయానికి నెహ్రూనే బాధ్యులా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | “Excellent,” says Congress Parliamentary Party Chairperson Sonia Gandhi on the maiden address of Congress MP Priyanka Gandhi Vadra in Lok Sabha pic.twitter.com/uPWEHogEY8
— ANI (@ANI) December 13, 2024