CEC Gyanesh Kumar : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్‌లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు. ఐకానిక్ హెరిటేజ్ కాంప్లెక్స్ (Iconic Heritage Complex) ను సందర్శించి దాని నిర్మాణ లక్షణాలను (Architectural Features), చారిత్రక ప్రాముఖ్యతను పరిశీలించారు.
అంతకుముందు ఆయన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానాన్ని సీఈసీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయన అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం 4.30 గలకు కుంకుమార్చణ, వేదాశ్వీరచనం, అభిషేకంలో పాల్గొన్నారు. రాత్రి భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌లోనే బసచేసి, తెల్లవారుజామున మరోసారి స్వామివారిని దర్శించుకుని ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు.
#WATCH | Hyderabad, Telangana: Chief Election Commissioner of India, Gyanesh Kumar, visited Golconda Fort in Hyderabad. pic.twitter.com/CFDQ4qJMMD
— ANI (@ANI) December 20, 2025