Leh protest : కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ (Ladakh) కు రాష్ట్ర హోదా (Statehood) కల్పించాలని, ఆదేవిధంగా లఢఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth schedule) లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరం (Leh city) లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు ఆందోళనకారులపై లాఠీలు ఝలిపించగా.. ఆందోళనకారులు వారిపై తిరగబడ్డారు. రాళ్లు రువ్వుతూ వెంటపడ్డారు. ఈ క్రమంలోనే లేహ్‌లోని బీజేపీ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాగా ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో బీజేపీ కార్యాలయం మంటల్లో తగులబడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd
— ANI (@ANI) September 24, 2025