Awadh Ojha : ప్రముఖ ఎడ్యుకేటర్ అవధ్ ఓఝా (Awadh Ojha) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో చేరారు. పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా (Manish Sisodia) సమక్షంలో ఓఝా ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. అర్వింద్ కేజ్రీవాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఓఝా మీడియాతో మాట్లాడుతూ.. విద్య అనేది కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఆత్మ లాంటి మాధ్యమమని అన్నారు.
రాజకీయాల్లో చేరి విద్యాభివృద్ధికి కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించిన అర్వింద్ కేజ్రీవాల్‌కు, మనీష్ సిసోడియాకు అవధ్ ఓఝా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇవాళ నేను రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మీతో ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. నేను రాజకీయాలు, ఎడ్యుకేషన్‌లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే కచ్చితంగా ఎడ్యుకేషన్నే ఎంచుకుంటాను’ అని ఓఝా చెప్పారు.
రాజకీయాల్లో చేరడం ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేయాలని తాను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నానని ఓఝా తెలిపారు. ఓఝా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలు రాసే అభ్యర్థులకు శిక్షణ ఇస్తుంటారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఎంతో మంది ఉద్యోగార్థులు పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు.
#WATCH | On joining the Aam Aadmi Party, Awadh Ojha says “I thank Arvind Kejriwal and Manish Sisodia for giving me the opportunity to work for education by joining politics. Education is such a medium which is the soul of the family, society and nation. Today, at the beginning of… https://t.co/LFS9130A1W pic.twitter.com/64qVJTmDcZ
— ANI (@ANI) December 2, 2024