ముంబై: ముంబై ఎయిర్‌పోర్టులో ఈ ఉదయం కలకలం చెలరేగింది. ఇండిగో విమానాన్ని పార్కు చేసి ఉంచిన స్థలంలో అగ్నిప్రమాదం ( Airport fire accident ) చోటుచేసుకుంది. విమానాల నుంచి దించిన లగేజీని తీసుకురావడానికి, విమానాల్లో ఎక్కించాల్సిన లగేజీని తీసుకెళ్లడానికి వినియోగించే లాగుడు బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో ఆ మంటలను ఆర్పేశారు.
దాంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఎయిర్‌పోర్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. కింది వీడియోలో ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.
#WATCH A pushback tug caught fire at #Mumbai airport earlier today; fire under control now. Airport operations normal. pic.twitter.com/OEeOwAjjRG
— ANI (@ANI) January 10, 2022