Car accident : ఓ కారు (Car) అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue operation) చేపట్టారు. కాలువలో నుంచి కారును, రెండు మృతదేహాలను వెలికితీశారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని గాంధీనగర్ (Gandhinagar) లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
గాంధీనగర్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్‌కు చెందిన ఇన్చార్జి చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేష్ పటేల్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 2.43 గంటలకు కిరణ్ దేశాయ్ అనే వ్యక్తి తమకు ఫోన్ చేసి కారు నర్మదా కాలువలో పడిన విషయాన్ని చెప్పారని, ఆ వెంటనే తమ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయని తెలిపారు.
కాలువలో నుంచి కారుతోపాటు రెండు మృతదేహాలను వెలికి తీశామని రాజేష్ పటేల్ చెప్పారు. అయితే ప్రమాదానికి గురైన కారులో ఎంతమంది ఉన్నారో ఇంకా తెలియరాలేదని, దాంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
#WATCH | Gujarat: A car fell into a canal in Gandhinagar. Rescue operation being carried out. pic.twitter.com/Qwdf3TbnKv
— ANI (@ANI) July 1, 2025