Waqf Bill | వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లు (Waqf Bill) మరికాసేపట్లో లోక్‌సభ (Lok Sabha) ముందుకు రానుంది. బుధవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
ఈ బిల్లును ఎట్టి పరిస్థితిల్లోనూ ఇదే సమావేశంలో ఆమోదించాలని అధికార పక్షం భావిస్తోంది. అయితే, రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సమైక్యంగా వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ ఆధారంగా ఈ బిల్లుకు ఆమోదం లభించనుంది. ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కాలంటే 272 ఓట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం సభలో బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీకి 16, జేడీయూకు 12 మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలే కాకుండా ఎల్జేపీకి ఐదుగురు, ఆర్ఎల్డీకి ఇద్దరు, శివసేన (షిండే)కు ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
మొత్తంగా బీజేపీకి సభలో 282 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయా పార్టీలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ సభలో ఓట్లు తమకే అనుకూలంగా వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. దీనిపై ఎగువ సభలో చర్చ ఉంటుంది. చర్చ అనంతరం అక్కడ కూడా ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే, బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది సభ్యుల మద్దతు ఉంటుంది.
మరోవైపు నేడు సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఓటింగ్‌లో పాన్గొనాలని ఆదేశించాయి. ఈ బిల్లుపై సభలో దాదాపు 8 గంటల పాటూ చర్చ జరగనుంది. చర్చ అనంతరం సాయంత్రం ఓటింగ్ నిర్వహిస్తారు.
Also Read..
Line of Control: నియంత్రణ రేఖ దాటిన పాకిస్థాన్ ఆర్మీ.. ఫైరింగ్‌ను తిప్పికొట్టిన భారత బలగాలు
Sunita Williams | పెంపుడు శునకాలతో సరదాగా గడిపిన సునీతా విలియమ్స్.. వీడియో వైరల్