న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో 26 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలతో జరిగిన చర్చల్లో పలు డిమాండ్లకు మోదీ సర్కార్ సమ్మతించటం వల్లే ఆయన దీక్షను విరమించారు. మరోవైపు శుక్రవారం క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటామంటూ ప్రధాని మోదీ అర్ధరాత్రి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జంతర్‌మంతర్ వేదికగా వాంగ్‌చుక్ ప్రారంభించిన దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం దవాఖానకు తరలించారు. అప్పట్నుంచి దవాఖానలోనే ఆయన దీక్ష కొనసాగుతుంది.