న్యూఢిల్లీ : రోజుకు కనీసం 4,000 అడుగులు నడిచినా శారీరక ఆరోగ్యం బాగుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం.. వారానికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ విధంగా నడిస్తే సరిపోతుంది. ఇంత కన్నా తక్కువ నడిచే వారితో పోల్చినపుడు వీరు అకాల మరణం ముప్పు లేదా హృదయ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.
ప్రతి వారం కనీసం మూడు రోజులపాటు ఈ విధంగా నడిచే వృద్ధ మహిళలు ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు. కొన్ని సందర్భాల్లో మరణించే ముప్పు 40 శాతం తగ్గుతుంది. వేలాది మంది వృద్ధ మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.