న్యూఢిల్లీ: పేపర్ బ్యాలట్ విధానం పునరుద్ధరణ, ఈవీఎం-వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన అరుణ్ అగర్వాల్ ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికల్లో పేపర్ బ్యాలట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ 26న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని అగర్వాల్ ఈ తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు.