తిరువనంతపురం: కేరళలో బీజేపీ చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం మేయర్‌గా బీజేపీ నేత వీవీ రాజేశ్(VV Rajesh) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌గా ఎన్నికైన తర్వాత రాజేశ్ మాట్లాడుతూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు. అన్ని 101 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఓ అభివృద్ధి చెందిన నగరంగా తిరువనంతపురం మారుతుందన్నారు. ఇది చరిత్రాత్మక సందర్భం అని, ఇది కేరళ రాజకీయాల్లో మార్పు తెస్తుందని, తిరువనంతపురంలో జరిగిన మార్పు.. యావత్ రాష్ట్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
కేరళలో బీజేపీ ప్రాబల్యం తక్కువే. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వీవీ రాజేశ్.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొడుంగనూరు వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. ఆ విక్టరీతో ఇప్పుడు ఆయన తిరువనంతపురం మేయర్‌గా మారారు. మరో ఆరు నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. 2016లో నీమమ్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాగోపాల్ గెలిచారు. ఆ తర్వాత 2024లో త్రిసూరు నుంచి సురేశ్ గోపి విజయం సాధించారు.
మేయర్ రేసులో రాజేశ్‌కు 51 ఓట్లు పడ్డాయి. తిరువనంతపురం మున్సిపాల్టీలో మొత్తం 100 మంది సభ్యులు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఆర్పీ శివాజీకి 29, కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్కు 19 ఓట్లు పోలయ్యాయి. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గైర్హాజరు అయ్యారు. రెండో స్వతంత్య్ర కౌన్సిలర్ పీ రాధాకృష్ణన్ ఓటు విజయంలో కీలకంగా మారింది. డిసెంబర్ 9వ తేదీన జరిగిన వార్డు ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు దక్కాయి.
#WATCH | Kerala: BJP State Secretary and Kodunganoor ward councillor VV Rajesh has been elected as the Mayor of Thiruvananthapuram Corporation
He says, “This is a historic moment, and I think this moment will change the political situation of Kerala… I think that the… pic.twitter.com/4XfnwQlXm8
— ANI (@ANI) December 26, 2025