న్యూఢిల్లీ, మే 19: ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. రష్యా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. పుతిన్ పాల్గొనే విషయాన్ని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ నిర్ధారిస్తూ ప్రపంచంలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్న క్రమంలో ఇది కీలక దౌత్య కలయికగా పేర్కొన్నారు.
దీని కారణంగా బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత విస్తరిస్తుందన్నారు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఐదు దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండి యా, చైనా, సౌత్ ఆఫ్రికా) సమూహాన్నే బ్రిక్స్‌గా వ్యవహరిస్తారు.