న్యూఢిల్లీ : భర్త ఆకలి తీర్చేందుకు భార్యలు తాము తినకుండా మిగిలిన ఆహారం కూడా భర్తకే పెట్టేందుకే మొగ్గుచూపుతుంటారు. ఇలాంటి ఓ ఘటనను హైలెట్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ ఓ జంట వీడియోను (Viral video) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో భార్య తాను వడ్డించుకున్న ఆహారాన్ని కూడా భర్తకు వడ్డిస్తుంటే అతడు ఆమె త్యాగాన్ని పట్టించుకోకుండా ఫోన్లో మునిగితేలుతుండటం కనిపిస్తుంది.
ప్లేటు ఖాళీ చేసిన ప్రతిసారి అన్నం వడ్డించాలని భార్యకు ఆర్డర్ వేస్తుంటాడు. గిన్నెలో రైస్ లేకపోవడంతో ప్రతిసారీ ఆమె తన ప్లేట్లో రైస్‌ను గిన్నెలో వేసి ఆపై భర్తకు వడ్డిస్తుంటుంది. ఇవేమీ పట్టించుకోని భర్త ఫోన్ చూసుకుంటూ పలుసార్లు అన్నం వడ్డించాలని అడుగుతుంటాడు.
ఈ వీడియోను పలువురు ట్విట్టర్లో షేర్ చేశారు. మహిళ ఈ రకంగా త్యాగం చేయడంపై కొందరు భార్యల తీరు ఇంతేనని ప్రశంసించగా పలువురు నెటిజన్లు పెదవివిరిచారు. భర్త ఏమాత్రం భార్య త్యాగాన్ని పట్టించుకోకపోవడం ఏంటని మరికొందరు నెటిజన్లు భగ్గుమన్నారు.
Read More :