టోక్యో: అతని కోరిక నిజమైంది. కుక్కలా మారాలనుకున్నాడు. 12 లక్షలు ఖర్చు చేశాడు. కుక్క బొచ్చును పెట్టుకున్నాడు. ఇక ఆ గెటప్‌లో తొలిసారి జనం మధ్య తిరిగాడు. జపాన్(Japan)కు చెందిన ఆ వ్యక్తి పేరు టాకో. కుక్క కాస్టూమ్ కోసం 12 లక్షలు(14వేల డాలర్లు) ఖర్చు చేశాడు. ఆ కుక్క బొచ్చును తయారు చేసేందుకు మేకర్లకు 40 రోజుల టైం పట్టింది. ఏదైతేనేం అతను కన్న కలను నెరవేరాలా చేశారు.
టాకోకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అతనికి 33 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కుక్క కాస్టూమ్‌లో అతను ఓ పార్క్‌లో తిరిగాడు. ఆ సమయంలో కొందరు ఆ కుక్కతో చాట్ చేశారు. ఇక తోటి కుక్కలు కూడా టాకోను చూసి థ్రిల్ అయ్యాయి. తన యూట్యూబ్ ఛానల్లో అతను తొలిసారి వీడియోలు పోస్టు చేశాడు.