Viral Video : ఆన్లైన్లో ఫాంటా మ్యాగీ, మ్యాగీ ఐస్‌క్రీంతో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ వైరల్ అవగా ఈ గతానుభావాలు ఇలా ఉంటే మరో లేటెస్ట్ మ్యాగీ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూ వైరల్ వీడియో ఇంటర్నెట్ యూజర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వీడియోలో తోపుడు బండిపై ఓ వీధివ్యాపారి క్రష్డ్ డ్రై మ్యాగీ నూడుల్స్‌ను రాసులుగా పోసి అమ్ముతుండటం కనిపిస్తుంది.
ఇప్పటివరకూ కూరగాయలు, పండ్లు, పీనట్స్, నంకీన్స్ను తోపుడు బండ్లపై విక్రయిస్తుండగా ఇప్పుడు లూజ్ మ్యాగీని బండిపై సేల్ చేయడం అసాధారణంగా జనాలు చెప్పుకున్నారు. ఈ వైరల్ వీడియోను ఏకంగా 4.1 కోట్ల మంది వీక్షించడం గమనార్హం. చటోర్ బ్రదర్స్ అనే అకౌంట్ ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా నెట్టింట సందడి చేస్తోంది. ఈ వీడియోలో లూజ్ మ్యాగీ నూడుల్స్‌ను ఎలాంటి ప్యాకెట్స్ లేకుండా రాసులుగా పోసి విక్రయించడం కనిపిస్తుంది.
ఆపై లూజ్ మ్యాగీని వీధి వ్యాపారి తూకం వేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో కస్టమర్లకు అందించడం చూడొచ్చు. అయితే మ్యాగీని ఇలా విక్రయించడంపై పలువురు యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది గడువు ముగిసిన మ్యాగీ అని దయచేసి దీన్ని వాడద్దని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఫ్యాక్టరీలో మిగిలిపోయినవి ???? లేదా ఎక్స్పైర్డ్???” అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేశారు. మ్యాగీతో పాటు డస్ట్ ఫ్లేవర్ కూడా ఉచితంగా వస్తుందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read more :
Dhanush – Aishwarya | విడాకుల తర్వాత తొలిసారి భర్త గురించి మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్