Dhanush – Aishwarya | కోలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకోని ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. అయితే విడాకులు ప్రకటించిన చాలా రోజుల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ తన భర్త ధనుష్ గురించి మాట్లాడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య.. అనిరుధ్ గురించి మాట్లాడుతూ.. అనిరుధ్ రవిచందర్ జీవితంలో ధనుష్ ప్రత్యేకమైన వ్యక్తి అనే విషయాన్ని బయటపెట్టింది.
ధనుష్ కారణంగానే అనిరుధ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అనిరుధ్‌ను అతడి తల్లిదండ్రులు ఎంబీఏ చదివించేందుకు సింగపూర్ పంపించాలనుకున్నారు. కానీ ధనుష్ అందుకు ఒప్పుకోలేదు. అనిరుధ్‌కు ఉన్న టాలెంట్‌ను ధనుష్ గుర్తించి వాళ్ల పేరెంట్స్ తో మాట్లాడారు. దాని తర్వాతే అనిరుధ్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అనిరుధ్‌కు ఇంత మంచి పేరు వచ్చిందంటే ధనుషే కారణం అంటూ తెలిపింది.