గుండెల్లో దడ పుట్టిస్తున్న వీడియో.. మెట్లపొంటి ఇంట్లోకి దూరుతున్న భారీ కొండచిలువ
Viral Video | ఇంటర్నెట్..! మన మొబైల్ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందంటే చాలు.. ప్రపంచం మొత్తం మన కళ్లముందు ఉన్నట్టే. మన వ్యక్తిత్వం ఎలాంటిది అనే
Viral Video: ఇంటర్నెట్..! మన మొబైల్ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందంటే చాలు.. ప్రపంచం మొత్తం మన కళ్లముందు ఉన్నట్టే. మన వ్యక్తిత్వం ఎలాంటిది అనే దానితో సంబంధం లేకుండా.. మనలోని నవరసాలను వెలికి తీయగల రకరకాల వీడియోలు అంతర్జాలంలో ఉంటాయి. నవ్వించే వీడియోలు, కవ్వించే వీడియోలతోపాటు చూడగానే గడగడ వణికించే, గుండెల్లో దడపుట్టించే వీడియోలు కూడా ఉంటాయి.
అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ముప్పై రెండు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ఒక భారీ కొండచిలువ ఓ ఇంట్లోకి దూరుతున్న దృశ్యాలు ఉన్నాయి. మెట్లకు ఆనుకుని ఉండే రెయిలింగ్‌పై పాకుతూ ఆ కొండచిలువ ఇంటి పై అంతస్తులోకి వెళ్తున్న దృశ్యాలు నెటిజన్ల ఒళ్లు జలదిరింప జేస్తున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతానంద ఈ వీడియోను ఇవాళ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ట్విట్టర్లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. సోమవారం ఉదయం పదిన్నరకు పోస్టు చేయగా.. మధ్యాహ్నానికి 10 వేల మందికిపైగా వీక్షించారు. మరో 400 మందికిపైగా లైక్ చేశారు. అంతేగాక రకరకాల కామెంట్ల వర్షం కురుస్తున్నది. ఈ భయం పుట్టించే వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి..
To go up,
One doesn’t need a staircase every time ☺️☺️ pic.twitter.com/UIix7uby89— Susanta Nanda (@susantananda3) October 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

