న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉంది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, నాలుగింట మూడు కుటుంబాల్లో కనీసం ఒకరు అస్వస్థతతో బాధపడుతున్నారు. 15,000 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
సెప్టెంబర్లో 56% కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది రోగులు ఉన్నారు. ఇటువంటి కుటుంబాలు అక్టోబర్లో 75 శాతానికి పెరిగాయి.