న్యూఢిల్లీ : దిల్ దే దియా హై సాంగ్‌ను ఆలపించి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన వైరల్ బిహార్ బాయ్ అమర్జిత్ జైకర్ లేటెస్ట్గా మేరే యారా సాంగ్ పాడుతూ న్యూ వీడియోతో (Viral Video) నెటిజన్ల ముందుకొచ్చాడు. అర్జిత్ సింగ్ సాంగ్ మేరే యారా పాడుతున్న తన వీడియోను జైకర్ ట్విట్టర్లో షేర్ చేశారు.
अपने आइडल ka gaana @arijitsingh सर 🙏🙏🙏🙏 pic.twitter.com/T6HwfNVdQ9
— Amarjeet Jaikar (@AmarjeetJaikar3) February 25, 2023
ఈ వీడియోకు ఇప్పటివరకూ 24,000 వ్యూస్ లభించాయి. ఈ పాటను జైకర్ హృద్యంగా ఆలపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అతడి మెలోడియస్ వాయిస్ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోందని ప్రశంసలకు అతడు అర్హుడేనని పలువురు కామెంట్ చేశారు.
అద్భుతమైన గొంతు అతడిదని ఓ యూజర్ మెచ్చుకోగా సూపర్బ్ అంటూ మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. 2021లో విడుదలైన సూర్యవంశీ సినిమాలో మేరే యారా సాంగ్ అప్పట్లో ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ తదితరులు నటించారు.
Read More :