Viral Post | 1958 నుంచి 1974 వరకూ చూసిన సినిమాలను డైరీలో రాశాడు
దైనందిన జీవితంలో ఘటనలను కొందరు క్రమం తప్పకుండా అక్షరబద్ధం (Viral Post) చేస్తుంటారు. ఇవే తర్వాతి తరాలకు మధురమైన జ్ఞాపకాలుగా నిలవడంతో పాటు అప్పటి పరిస్ధితులకూ అద్దం పడుతుంటాయి.
టోక్యో : దైనందిన జీవితంలో ఘటనలను కొందరు క్రమం తప్పకుండా అక్షరబద్ధం (Viral Post) చేస్తుంటారు. ఇవే తర్వాతి తరాలకు మధురమైన జ్ఞాపకాలుగా నిలవడంతో పాటు అప్పటి పరిస్ధితులకూ అద్దం పడుతుంటాయి. ఇక ఓ వ్యక్తి 1958 నుంచి 1974 వరకూ తాను చూసిన సినిమాలను తేదీ, సమయం వంటి వివరాలతో సహా రికార్డు చేశారు. ఓ డైరీలో తాను చూసిన 470 సినిమాల రికార్డును పదిలపరిచాడు.
ఆ వ్యక్తి మనవడు అక్షీ ఈ వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయా సినిమాల పేర్లు, భాష వంటి అనేక వివరాలు ఈ డైరీలో ఉన్నాయి. ఎన్నో ఏండ్ల కిందటే మా తాత ఆయన వెర్షన్‌గా పిలిచే లెటర్బాక్స్డ్ క్రియేట్ చేశారు..తాను చూసిన సినిమాల వివరాలను అందులో పొందుపరిచారు. థియేటర్లలో హిచ్‌కాక్, జేమ్స్ బాండ్ సినిమాలను ఆయన వీక్షించారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
1958 నుంచి 1974 వరకూ సదరు వ్యక్తి చూసిన సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఎంట్రీలు ఈ డైరీలో కనిపించాయి. అసలు తన తాత ఎన్ని సినిమాలు చూశారనే వివరాలను ప్రస్తావిస్తూ అక్షీ రెండు వేర్వేరు ట్వీట్స్‌లో వెల్లడించారు. ఈ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇది చాలా అమూల్యమైనదని ఓ యూజర్ కామెంట్ చేయగా అసలైన సినీ ప్రేమికుడంటే మీ తాతేనని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
-
Samantha Ruth Prabhu | 13 ఏండ్ల ప్రయాణం.. ఇకపై నన్ను ఏదీ బాధించదు.. సమంత ఎమోషనల్ పోస్ట్..!
-
Manchu Manoj | భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి.. డేట్ ఫిక్స్ ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- grandfather
- MAN
- viral post
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

