Samantha Ruth Prabhu | 13 ఏండ్ల ప్రయాణం.. ఇకపై నన్ను ఏదీ బాధించదు.. సమంత ఎమోషనల్ పోస్ట్..!
Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ (Tollywood Star) నటి సమంత (Samantha) తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 13 ఏండ్లైంది. ఈ సందర్భంగా సమంత అభిమానులను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టింది.
Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ (Tollywood Star) నటి సమంత (Samantha) తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 13 ఏండ్లైంది. మొదటిసారిగా ‘ఏమాయ చేశావే’ ( Ye Maaya Chesave) చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో జెస్సీ పాత్రలో సమంత యువతరాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఇక ఆమె నటించిన ‘ఏ మాయ చేశావే’ సినిమా విడుదలై 13 ఏండ్లు అవుతోంది.
ఈ సందర్భంగా సమంత అభిమానులను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టింది. తనపై ప్రేమను చూపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. వాళ్ల ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంది. ‘ఈ జర్నీలో ఎన్నో విషయాలు నన్ను బాధించాయి. ఇకపై ఏదీ నన్ను బాధపెట్టదు. కేవలం అభిమానుల ప్రేమ, కృతజ్ఞతతో ఇలా కొనసాగుతున్నా. నేను ఎంత ఎదిగినా.. ఎంత దూరం ప్రయాణించినా.. అభిమానులు చూపించే ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను. అలాగే, నాకు కొత్త విషయాలను పరిచయం చేస్తోన్న ప్రతిరోజుకూ థ్యాంక్స్’ అంటూ సామ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
సమంత (Samantha) -నాగచైతన్య (Naga Chaitanya) జంటగా నటించిన ‘ఏ మాయ చేశావే’ ( Ye Maaya Chesave) చిత్రం 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. ఈ చిత్రంలో సామ్ జెస్సీ పాత్రలో నటించి మెప్పించింది. ఫీల్ గుడ్ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి గౌతమ్ మేనన్ (Gautam Menon) దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన సామ్-చై.. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం కొన్ని అనుకోని కారణాల వల్ల 2021లో వీరు తమ బంధానికి స్వస్తిపలికారు.
ఇక సామ్.. కొంతకాలంగా ‘మయోసైటిస్’ (myositis) అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటోంది. మయోసైటిస్ కారణంగా ‘యశోద’ (Yashoda) చిత్రం తర్వాత విరామం తీసుకున్న సమంత.. తిరిగి తన ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడింది. ‘శాకుంతలం’ (Sakuntalam) ప్రమోషన్స్ చేస్తూనే రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ (citadel) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ‘ఖుషి’ (khushi) చిత్రీకరణలోనూ సామ్ జాయిన్ కాబోతోంది.
Also Read..
Manchu Manoj | భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి.. డేట్ ఫిక్స్ ?
Ram Charan | రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం.. ఆర్ఆర్ఆర్ నటుడి స్పందన ఇదీ..!
Joseph Manu James | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

