Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాష్ట్రవ్యాప్త పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఈ విషయాన్ని టీవీకే పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కరూర్ ఘటన నేపథ్యంలో తమ పార్టీ నాయకుడు విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనను రెండు వారాల పాటూ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విజయ్ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బహిరంగ సభలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పోలీసుల అనుమతితో వచ్చే వారం విజయ్ కరూర్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం.
కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని టీవీకే ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు దర్యాప్తునకు డిమాండ్ చేస్తోంది. తొక్కిసలాట ఘటనపై విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు మంగళవారం వీడియో సందేశాన్ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read..
కక్ష ఉంటే నాపైన కేసులు పెట్టండి.. స్టాలిన్‌కి విజయ్ సవాల్
Karur Stampede | నేపాల్లోలాగా ఇక్కడ కూడా యువత తిరగబడాలి.. టీవీకే నేత వివాదాస్పద ట్వీట్
TVK functionary | టీవీకే కార్యకర్త ఆత్మహత్య.. కరూర్ తొక్కిసలాటకు వాళ్లే బాధ్యులంటూ సూసైడ్ నోట్