న్యూఢిల్లీ: కరూర్ సభలో తాను కాని, తన పార్టీ నిర్వాహకులు కాని ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించ లేదని టీవీకే అధినేత విజయ్ తెలిపారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, కాని తన పార్టీ నాయకులు, సోషల్ మీడియా యూజర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనపైన తీర్చుకోవాలని, వారిని తాకవద్దని నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ పేరు చెబుతూ విజయ్ సవాలు చేశారు. మరోవైపు క్రూరమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులో కూడా జెన్జీ విప్లవం వస్తుందంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.