Karur Stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని టీవీకే ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ నేత పెట్టిన పోస్టు ప్రస్తుతం వివాదాస్పదమైంది.
తమపై కుట్రలకు పాల్పడుతున్న దుష్ట ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే నేపాల్ మాదిరిగా ఇక్కడ యువత తిరగబడాలంటూ టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ అర్జున్ (Aadhav Arjuna) పోస్టు పెట్టారు. ‘యువత నేతృత్వంలోని ఉద్యమమే ఏకైక పరిష్కారం. జనరేషన్ జెడ్ యువత శ్రీలంక, నేపాల్‌లో పాలక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. ఇక్కడ కూడా యువత ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. ఆ ఉద్యమమే ప్రభుత్వం మార్పునకు కారణం అవుతుంది. దుష్టపాలకుల పాలనలో చట్టాలు కూడా దుర్మార్గంగా మారతాయి’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టు వైరల్ కావడంతో తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ పోస్టును అర్జున్ తొలగించారు. అయితే, అప్పటికే స్క్రీన్‌షాట్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read..
Karur stampede | కరూర్ తొక్కిసలాట.. యూట్యూబర్ అరెస్ట్
TVK functionary | టీవీకే కార్యకర్త ఆత్మహత్య.. కరూర్ తొక్కిసలాటకు వాళ్లే బాధ్యులంటూ సూసైడ్ నోట్
జెన్-జీ శంఖారావం.. అనేక దేశాలకు విస్తరిస్తున్న యువజన నిరసనలు