Investor Meet : బిహార్‌లో పరిశ్రమల ఏర్పాటుకు గాను పారిశ్రామికవేత్తలను ఆకర్షించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమి, విద్యుత్, నీటిసరఫరా వంటి వసతులు కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.
బిహార్ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉందని చెప్పారు. బిహార్ ప్రభుత్వం వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఏ పరిశ్రమకు చెందిన ఉత్పత్తులనైనా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్రంలో, బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరడం రాష్ట్రానికి మేలు చేస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రాష్ట్రానికి భారీ కంపెనీలు తరలివస్తే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇన్వెస్టర్ల సదస్సును ఏర్పాటు చేసినందుకు సీఎం నితీష్ కుమార్‌తో పాటు బిహార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Read More :
Prabhas Fauji | ‘స్పిరిట్’ ఆలస్యం.. అక్టోబర్‌లో సెట్స్‌పైకి ప్రభాస్ ‘ఫౌజీ’?