Prabhas Fauji | ‘స్పిరిట్’ ఆలస్యం.. అక్టోబర్‌లో సెట్స్‌పైకి ప్రభాస్ ‘ఫౌజీ’?
Prabhas Fauji | టాలీవుడ్లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరో అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్పక తప్పదు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ 2తో పాటు కల్కి పార్ట్, రాజా సాబ్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేయడానికి కనీసం ఇంకో సంవత్సరం అయిన పడుతుంది.
Prabhas Fauji | టాలీవుడ్లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరో అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్పక తప్పదు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ 2తో పాటు కల్కి పార్ట్, రాజా సాబ్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేయడానికి కనీసం ఇంకో సంవత్సరం అయిన పడుతుంది.
అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మరో టాలీవుడ్ దర్శకుడికి ఒకే చెప్పిన విషయం తెలిసిందే, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడితో ‘ఫౌజీ’ అనే మూవీ ఒకే చేశాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో లేదా, నవంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాను మొదట 2024 చివరిలో షూటింగ్ ప్రారభించనున్నట్లు చిత్ర దర్శకుడు ప్రకటించాడు. అయితే ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండడంతో ఆ స్థానంలో
‘ఫౌజీ’ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. ఇందులో కథానాయికగా మృణాళ్ఠాకూర్ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

