The Birthday Boy Review | నటీ నటులు: రవికృష్ణ, రాజీవక్ కనకాల, సమీర్, రాజా అశోక్, విక్రాంత్ వేద్, సాయి అరుణ్, రాహుల్ సిహెచ్, దర్శకత్వం: విస్కీ, నిర్మాత : భరత్ ఐ
ఎటువంటి నేపథ్యం లేకుండా.. కొత్తవాళ్లు సినిమా చేస్తే…ఆ సినిమాకు సినీ పరిశ్రమ నుండి పెద్దగా సపోర్ట్ లభించదు.. అయితే తాము కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నామని తెలుసు.. వాళ్ల సినిమాకు థియేటర్ల్కు ప్రేక్షకులు రావడం కష్టమని తెలుసు.. అయినా కొత్త నటీనటులతో.. సినిమా తీశారు. అనుకున్న విధంగానే వాళ్లకు సినీ పరిశ్రమ నుండి పెద్ద ప్రొత్సాహం ఏమీ రాలేదు.
ఇక వాళ్లే సినిమాకు వినూత్న పబ్లిసిటీతో ప్రేక్షకులకు దగ్గర చేయాలని అనుకుని.. కొత్త ఆలోచనలతో ప్రమోషన్స్ కంటెంట్ చేసి కొంత బజ్ క్రియేట్ చేశారు. అందరి దృష్టి ఆకర్షించారు. ఆ సినిమానే ది బర్త్‌డే బాయ్. ఇక వీళ్ల పబ్లిసిటీ కంటెంట్ తగ్గట్టుగానే వీళ్ల సినిమా కొత్తగా వుందా? లేక కేవలం పబ్లిసిటి మాత్రమే వినూత్నంగా వుండి.. సినిమా రోటిన్‌గా వుందా తెలుసుకోవాలంటే ఈ సినిమా సమీక్షలో తెలుసుకుందాం..
కథ :
అమెరికాలో చదువు కోసం ఒకే వూరి నుండి వెళ్లిన ఐదుగురు స్నేహితులు అక్కడ ఒకే ఇంట్లో వుంటారు. అందులో బాలు అనే స్నేహితుడి పుట్టినరోజు నాడు జరిగిన పార్టీలో మద్యం మత్తులో ఆ స్నేహితులు జరిపిన బర్త్ డే బంప్స్లో బాలు అనుకోకుండా చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ నలుగురు స్నేహితుల్లో ఒకరి అన్నయ అయినా రవికృష్ణకు ఫోన్ చేసి పిలుస్తారు. అక్కడి వచ్చిన రవికృష్ణ ఆ సంఘటన చూసి షాక్ అవుతాడు. అయితే వీళ్ల అందరికి కామన్ ఫ్రెండ్ అయినా ప్రవీణ్.. బాడీని పరిశీలించి ఇది అనుకుకోండా జరిగిన మరణంలా లేదు మర్డర్లా వుందని అనుమనిస్తాడు. ఈ లోపు స్నేహితులు అందరూ బాలు వాళ్ల తల్లిదండ్రులను కేసు పెట్టకుండా కన్వీన్ చేసి అమెరికాకు రప్పిస్తారు? ఇక ఆ తరువాత కథలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అసలు బాలు కథేంటి? బాలు ఎలా మరణించాడు? బాలు చావుకు బర్త్‌డే బంప్స్ కారణం కాదా? ప్రవీణ్, భరత్‌లు కలిసి వాళ్ల స్నేహితులను ఎలా కాపాడారు? అనేది వెండితెరపై చూస్తేనే ఆసక్తకిరంగా వుంటుంది.
విశ్లేషణ:
ఇటీవల ప్రతి పేరెంట్స్‌కు ఇబ్బందికరంగా వున్న విషయం బర్త్‌డే బంప్ప్.. బర్త్‌డే రోజు నేటి పిల్లలు చేస్తున్న ఈ వింత పోకడలతో ప్రతి తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి ఓ ఇష్యూ ఈ చిత్ర దర్శకుడు విస్కి జీవితంలో కూడా జరిగింది. ఈ సంఘటన ఆధారంగానే ఈ కథను రాసుకొని.. దానికి కాస్త సినిమాటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా మొదలు పావుగంట కాస్త యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా మొదలై.. బాలు చనిపోయిన తరువాత కథ ఆసక్తికరంగా మారిపోతుంది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించాడు. సినిమాలోని సంభాషణలు కూడా చాలా నేచురల్‌గా అనిపించాయి.
సింక్ సౌండ్ వాడటం వల్ల ప్రతి సన్నివేశం రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో కాసేపు సరదా.. కాస్త ఎమోషన్ క్యారీ చేసిన దర్శకుడు సెకండాఫ్‌లో కథలో వున్న ట్విస్టులను ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచాడు. కథ మొత్తం అమెరికాలో జరుగుతున్న విధంగా రూపొందించడంలో దర్శకడు సఫలీకృతుడయ్యాడు. ముఖ్యంగా కథ మీద ఆసక్తిని కలిగించడంలో స్టోరీ నెరేషన్ ఎంతో ముఖ్యం.. చాలా కొత్తగా సినిమాను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తన జీవితంలో జరిగిన సంఘటన కాబట్టి చిత్ర కథను ఎమోషన్‌తో నడిపించాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత ఇందులో రియల్ కథ ఏమిటి? కల్పిత అంశాలు ఏమిటనే అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
కొత్త నటీనటులైన అందరూ ఎంతో సహజంగా నటించారు. ముఖ్యంగా రవికృష్ణ తన దైన నటనతో ఆకట్టకున్నాడు. మంచి పాత్రలు లభిస్తే తన ప్రతిభను నిరూపించుకుంటానని రవికృష్ణ ఈ పాత్ర ద్వారా తెలియజేశాడు. ఇక రాజీవ్ కనకాల తన పాత్రలో చాలా చక్కగా నటించాడు. చాలా రోజుల తరువాత రాజీవ్లోని నటనను వెలికితీసే పాత్ర లభించిందనేపించే విధంగా ఆ పాత్రలో ఇమిడిపోయాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ముఖ్యంగా దర్శకుడు పనీతీరు మెచ్చుకోదగినది. ఒకే ఇంట్లో.. చాలా తక్కువ పాత్రలతో,.. ఒకే అంశం చుట్టు జరిగే కథలో ఆడియన్స్ చివరి వరకు ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చిన్న బడ్డెట్లో చాలా క్వాలిటీ అవుట్‌పుట్ ఇచ్చాడు. ఫోటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా వుంది. అమెరికాలో వున్న విధంగా తలపించే రీతిలో ఆర్ట్స్ దర్శకుడు మెస్మరైజ్ చేసిన విధానం అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి యూజ్ చేసిన సింక్‌సౌండ్ విధానం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమాలో ఎమోషన్ క్యారీ అవ్వడంలో సింక్‌సౌండ్ ఎంతో ఉపయోగపడింది. చిన్ని సినిమా అయిన టెక్నికల్‌గా బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు.
ఫైనల్‌గా :
రియల్ ఇన్సిడెంట్ను కథ రూపంలో తీసుకొచ్చి.. సహజంగా.. అన్ని ఎలిమెంట్స్‌తో.. ఓ చక్కని సస్పెన్ థ్రిల్లర్‌గా ది బర్త్‌డే బాయ్‌ను తెరమీదికి తీసుకొచ్చిన విధానం అభినందనీయం. కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు నచ్చే చిత్రమిది. ది బర్త్‌డే బాయ్ అందరికి మంచి ట్రీట్ ఇచ్చాడనే చెప్పొచ్చు.
రేటింగ్ : 2.75/5
Maharaja | తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ సేతుపతి మహారాజ అరుదైన ఫీట్
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Double iSmart | బాలీవుడ్లో రామ్ టీం డబుల్ ఇస్మార్ట్ ప్లాన్
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ