Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ దళిత కుటుంబంతో ముచ్చటించారు. దళితుడి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబంతో కలిసి వంట చేశారు. ఈ సందర్భంగా ఆ దళితుడి కుటుంబంతో పలు విషయాలు మాట్లాడారు. వంట చేయడం పూర్తయిన అనంతరం ఆ దళితుడి కుటుంబంతో కలిసి రాహుల్‌గాంధీ భోజనం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పర్యటించిన రాహుల్‌గాంధీ.. ఈ సందర్భంగా అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే అనే దళిత దంపతుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల వంటగది గురించి నేటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని అన్నారు. కులవివక్ష గురించి వారితో పలు విషయాలు మాట్లాడారు. అంతేగాక షాహూ పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లో ‘దళితులు ఏం తింటారు..? ఎలా వండుతారు..? దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటి..? అనే విషయాలు తెలుసుకునేందుకు నేను దళితులైన అజయ్ తుకారాం సనాదే కుటుంబంతో ఒక మధ్యాహ్నం గడిపాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వారు తమ ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చారని, తామంతా కలిసి బెండకాయతో ‘హర్భయాచి భాజీ’ పచ్చిమిర్చి, తువర్ పప్పు తయారు చేశామని తెలిపారు.
दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”
वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te
— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024