న్యూఢిల్లీ : ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకునే వెరైటీ కబడ్డీ వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. పాకిస్తాన్లో రికార్డయిన ఈ వీడియోలో చూపిన విభిన్నమైన కబడ్డీ వేరియంట్‌ను చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెరైటీ గేమ్ వేరియంట్‌ను థప్పడ్ లేదా స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. సాధారణ కబడ్డీకి భిన్నంగా ఈ గేమ్‌లో పోటీదారులు ఒకరి చెంప మరొకరు వాయించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.
సంప్రదాయ కబడ్డీలో ఏడుగురు సభ్యులతో కూడిన ఇరు జట్లు తలపడనుండగా, ఈ గేమ్‌లో ఒకరికొకరు ముఖాముఖి తలపడతారు. ఈ తరహా కబడ్డీ గేమ్ నిబంధనలను పాకిస్తాన్ కబడ్డీ ఆటగాడు హజి తసవుర్ వెల్లడించారు. ఇద్దరి మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఎదుటి వ్యక్తిని కొట్టడం ద్వారా ఓ ఆటగాడు పాయింట్‌ను స్కోర్ చేస్తే మరో ప్లేయర్ ఆ పాయింట్‌ను అడ్డుకునేందుకు తనను డిఫెండ్ చేసుకుంటాడు.
What fighting style is this 😧 pic.twitter.com/D5mNAXEVwK
— Woman of Wonder 🐳 (@WonderW97800751) June 29, 2023
ఈ గేమ్‌లో మీరు ప్రత్యర్ధిని ఎన్ని సార్లు కొట్టాలనుకున్నా కొట్టవచ్చని హజి తసవుర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రజలు సంప్రదాయ కబడ్డీ కంటే ఈ తరహా గేమ్‌ను ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు. ఈ వీడియో ఎంటర్టైనింగ్గా ఉందని పలువురు యూజర్లు కామెంట్ చేస్తున్నారు.
Read More :