ముంబై: మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ ఎస్పీపీ నేత, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh) కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా ముందు మాట్లాడలేక ఆయన ఏడ్చేశారు. నాగ్‌పూర్‌లో మీడియా సమావేశంలో అనిల్ దేశ్‌ముఖ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు. కొంత మాట్లాడిన తర్వాత మళ్లీ శోకంలో మునిగిపోయారు. చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు.
కాగా, బారామతి జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ముంబై నుంచి చార్టెడ్ విమానంలో అజిత్ పవార్ బయలుదేరారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఆ విమానం కూలిపోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, పైలట్లు సుమిత్ కపూర్, శాంభవి పాఠక్, పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ జాదవ్, పింకీ మాలి మరణించారు.
#WATCH | Nagpur | NCP-SCP leader & former Maharashtra Home Minister, Anil Deshmukh, fails to find words and breaks down on news of Maharashtra Deputy CM Ajit Pawar’s passing away in a plane crash in Baramati pic.twitter.com/t7Q8ALAd0A
— ANI (@ANI) January 28, 2026
Also Read:
Sharad Pawar | ‘ఇది ప్రమాదమే.. ఎలాంటి కుట్ర లేదు’.. అజిత్ పవార్ మరణంపై శరద్ పవార్
Ramdas Athawale | అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
Eknath Shinde on Ajit Pawar | కపటం లేని, భయంలేని నేత అజిత్ పవార్: ఏక్నాథ్ షిండే
Air India Flight | తప్పిన ముప్పు.. రన్ వే టచ్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ రద్దు