CP Radhakrishnan | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు.
అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఉపరాష్ట్రపతికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. కాగా, భారత 15వ ఉపరాష్ట్రపతి (Vice President)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన (Take Oath) విషయం తెలిసిందే. వీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శనం కోసం వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు.
Also Read..
Srisailam | రావణ వాహనంపై విహరించిన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు.. Photos
Tirumala | తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక విరాళం