Roja on Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు చనిపోతుంటే పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని.. ఓజీ సినిమా ప్రమోషన్లో బిజీగా గడిపేస్తున్నారని విమర్శించారు. తన సినిమాలకు టికెట్ల ధరలను పెంచుకుంటున్నారని అన్నారు. అసలు పవన్ కల్యాణ్‌కు పాలిటిక్స్ ఎందుకు.. షూటింగ్‌లు చేసుకోవచ్చు కదా అని సూచించారు.
పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. పథకాలను పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. పేదల చదువును చంద్రబాబు, లోకేశ్ గాలికి వదిలేశారని అన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం ఓజీ ప్రమోషన్లో బిజీగా ఉన్నారని తెలిపారు. రైతులు చనిపోతుంటే పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని అన్నారు. తన సినిమాలు మాత్రం టికెట్ ధరలు పెంచుకుంటున్నారని విమర్శించారు. షూటింగ్‌ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్యాకేజి ఇస్తే చాలు అన్నట్లుగా పవన్ తీరు ఉందని రోజా విమర్శించారు. సీఎం తప్పు చేస్తే డిప్యూటీ సీఎంగా నిలదీయాలని అన్నారు. కానీ పిఠాపురంలో అత్యాచారం జరిగినా పట్టించుకోరని విమర్శించారు. అభిమానులు చనిపోతున్నా పట్టించుకోరని అన్నారు. పవన్ కల్యాణ్‌కు ఎందుకు డిప్యూటీ సీఎం పదవి అని డిమాండ్ చేశారు. పాలిటిక్స్ ఎందుకు.. షూటింగ్‌లు చేసుకోవచ్చు కదా అని సూచించారు. తలరాతలు మారుస్తానని గెలిచిన పవన్.. ఏ వర్గం కోసం పనిచేశారని ప్రశ్నించారు.