Jagdeep Dhankhar | భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా, వైద్యుల సలహా మేరకు తక్షణం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) ప్రకారం ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో సహకరించారని, ఇది తనకు చాలా ఆహ్లాదకరమైన అనుభవమని పేర్కొన్నారు. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మంత్రివర్గానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానమంత్రి సహకారం నాకు ఎంతో విలువైందని.. ఆయన నుంచి నేనెన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. గతంలో ధన్ఖర్ మాట్లాడుతూ ‘భగవంతుడు ఆశీర్వదిస్తే 2027 ఆగస్టులో పదవీవిరమణ చేస్తాను’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గౌరవనీయులైన ఎంపీల నుంచి లభించిన ఆప్యాతతో పాటు అనుంబంధం అమూల్యమైందని.. తనకు జ్ఞాపకంగా నిలిచి ఉంటుందన్నారు. ఈ కాలంలో భారతదేశం అపూర్వమైన ఆర్థిక పురోగతి, అసాధారణ అభివృద్ధిని చూడడం, అందులో భాగం కావడం తనకు గర్వకారణంగా నిలువడంతో పాటు సంతృప్తినిచ్చిందన్నారు.
ఈ సమయంలో దేశానికి సేవ చేయడం తనకు నిజమైన గౌరవమని, పదవికి రాజీనామా చేస్తున్న సమయంలో భారత్ అద్భుతమైన విజయాలపై తాను గర్వంగా ఉన్నానని, దేశ ఉజ్వల భవిష్యత్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వాస్తవానికి ఆయన ఐదేళ్ల పదవీకాలం 10 ఆగస్టు 2027న ముగియాల్సి ఉంది. జగదీప్ ధన్ఖర్ వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడానికి ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు.
Vice President Resignation Letter