శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఆగస్ట్ 6న భద్రతా దళాల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి అధికారులు వయాగ్ర ట్యాబ్లెట్లు, రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజౌరి జిల్లా తనమండి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. హతులైన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ జాతీయుడని, ఇటీవలే భారత్లోకి అతడు అక్రమంగా చొరబడ్డాడని భద్రతా దళాలు గుర్తించాయి.
తనమండి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు ప్రతిగా కాల్పులు జరపడంతో కొద్దిగంటల సేపు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు.