LK Advani | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి (Indraprastha Apollo Hospital)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
Veteran BJP leader Lal Krishna Advani has been admitted to the ICU at Indraprastha Apollo Hospital for medical management and investigations. He is under the care of Dr. Vinit Suri and is currently in stable condition: Apollo Hospital pic.twitter.com/ELR3KqN7xh
— IANS (@ians_india) December 14, 2024
ప్రస్తుతం అద్వానీ వయసు 97 ఏళ్లు. ఆయన గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో పలుమార్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తొలుత జూన్ 26న అద్వానీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. జులై 3న మరోసారి ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయన్ని ఎయిమ్స్కి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీన మరోసారి ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం ఇంటికి చేరారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Also Read..
Kiren Rijiju: దేశంలో మైనార్టీల పట్ల వివక్ష లేదు : కేంద్ర మంత్రి రిజిజు
Jamili Elections | ఈనెల 16న లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు..!
Bomb Threats | ఢిల్లీ పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు