కొవిడ్-19 : రూ 150 కోట్ల అదనపు సాయానికి అనిల్ అగర్వాల్ సంసిద్దత

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో వణుకుతున్న భారత్ లో కొవిడ్-19 కట్టడి కోసం రూ 150 కోట్ల అదనపు సాయానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. గత ఏడాది కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వేదాంత గ్రూప్ రూ 201 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పదినగరాల్లో 1000 పడకలు అదనంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని వేదాంత ఓ ప్రకటనలో పేర్కొంది.
అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఫీల్డ్ ఆస్పత్రుల్లో ఈ అదనపు పడకలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏసీ టెంట్ లతో 100 పడకలతో ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రముఖ ఆస్పత్రులతో వీటిని అనుసంధానం చేస్తామని వెల్లడించింది. కరోనా వ్యాప్తితో పడకలు, వైద్య పరికరాల కొరతను కొంతవరకైనా అధిగమించేందుకు ఇవి ఉపకరిస్తాయని వేదాంత ఆశాభావం వ్యక్తం చేసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం అత్యవసర వైద్య పరికరాలను సమకూరుస్తామని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

