Vande Bharat | వందేభారత్ రైలు ఆహారంలో పురుగు.. తయారీ సంస్థకు రూ.10 లక్షల జరిమానా
Vande Bharat : ఇటీవల ఒక ప్రయాణికుడికి వందేభారత్ రైలులో అందించిన ఆహారంలో ఏకంగా ఒక పురుగు కనబడింది. దీంతో షాక్‌కు గురైన ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
Vande Bharat : వందేభారత్ రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడూ నాణ్యత, శుభ్రత లేని ఆహారం, పురుగులతో కూడిన ఆహారం అందిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఒక ప్రయాణికుడికి వందేభారత్ రైలులో అందించిన ఆహారంలో ఏకంగా ఒక పురుగు కనబడింది. దీంతో షాక్‌కు గురైన ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
దీనిపై స్పదించిన ఐఆర్టీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సంస్థ ఫుడ్ కాంట్రాక్టర్‌కు భారీ జరిమానా విధించింది. ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడు అహ్మదాబాద్ నుంచి ముంబైకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడికి రైలులో ఆహారం అందించారు. అయితే, అతడికి అందించిన ఆహారం తింటుండగా మధ్యలో ఒక పురుగు కనపడింది. అలాగే, తనతోపాటు అదే కోచ్‌లో ఇంకొకరికి కూడా అలాగే పురుగులు వచ్చాయి. దీంతో ఆ కోచ్‌లో ఇతరులు ఎవరూ ఆహారం తీసుకోలేదని తెలిపాడు. ఇక, ఈ అంశానికి సంబంధించి వీడియో తీసి, అతడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనికి ఐఆర్టీసీ స్పదించింది. ఆదిత్య దగ్గరినుంచి వివరాలు సేకరించింది.
Found an insect in Vande Bharat train food (Ahmedabad → Mumbai). Atleast 2 such cases in my coach, everyone stopped eating after that.
Vendor: M/S Brandavan Food Products (part of RK Group).@fssaiindia @AshwiniVaishnaw @RailMinIndia @IRCTCofficial
Just one request to the… pic.twitter.com/rNrfVaNN5b
— Aditya Didwania (@adityadidwania) April 6, 2026
ఫుడ్ అందించిన కాంట్రాక్ట్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు, కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే, కిచెన్ సీజ్ చేసినట్లు కూడా వెల్లడించింది. శుభ్రత, ప్రయాణికుల ఆరోగ్యానికి తాము ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. అయితే, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఐఆర్టీసీ తగిన చర్యలు తీసుకోవాలని, కిచెన్లను అధికారులతో నిత్యం తనిఖీ చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- irctc
- meal
- Passenger
- Vande Bharat
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

