Vande Bharat | వందేభారత్ రైలులో అందించిన పెరుగులో ఫంగస్.. షాకైన ప్రయాణికుడు
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. భోజనంలో భాగంగా వడ్డించిన పెరుగులో ఫంగస్ (fungus) కనిపించింది.
Vande Bharat | రైళ్లలో అందించే ఫుడ్ (Meals) క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మార్పు మాత్రం రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైలులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. భోజనంలో భాగంగా వడ్డించిన పెరుగు (yoghurt)లో ఫంగస్ కనిపించింది.
హర్షద్ తోప్కర్ (Harshad Topkar) అనే వ్యక్తి డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ (Dehradun to Anand Vihar) వరకూ వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించాడు. ఆ సమయంలో అతనికి రైలులో భోజనంలో భాగంగా వడ్డించిన పెరుగులో ఫంగస్ (fungus) కనిపించింది. అది చూసిన అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఫొటోలు తీసి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఈ పోస్ట్‌ను నార్తర్న్ రైల్వే, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ఖాతాలకు ట్యాగ్ చేస్తూ రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతని పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
హర్షద్ తోప్కర్ ట్వీట్‌పై రైల్వే సేవా స్పందించింది. ప్రయాణ వివరాలను పంచుకోవాలని, వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపింది. మరోవైపు నార్తర్న్ రైల్వే కూడా హర్షద్ పోస్ట్‌కి ప్రతిస్పందించింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారిక ఖాతాకు ట్యాగ్ చేసింది.
Sir, kindly share PNR and mobile number preferably in Direct Message (DM) – IRCTC Official https://t.co/utEzIqB89U
— RailwaySeva (@RailwaySeva) March 5, 2024
Also Read..
Delhi temperature | ఢిల్లీలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు
Death Threats | ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని చంపుతామంటూ బెదిరింపు.. కన్నడిగుడిపై కేసు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

