న్యూఢిల్లీ, జూన్ 7: బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైళ్ల సగటు వేగం గత అయిదేండ్లలో 8 కిలోమీటర్లు తగ్గింది. 2020-21లో గంటకు 84.48 కి.మీ.గా ఉన్న వేగం 2023-24 నాటికి 76.25 కి.మీలకు పడిపోయింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. కాగా ఎక్కడా అది 130 కి.మీ. దాటిన దాఖలాలు లేవు. ఢిల్లీ-ఆగ్రా మార్గం లాంటి నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడానికి అనువైన ట్రాక్లను నిర్మిం చామని ఒక అధికారి చెప్పారు.