శనివారం 05 డిసెంబర్ 2020
National - Sep 06, 2020 , 10:35:18

ట్రైల‌ర్‌ను ఢీకొట్టిన‌ వ్యాన్‌.. ఏడుగురు మృతి

ట్రైల‌ర్‌ను ఢీకొట్టిన‌ వ్యాన్‌.. ఏడుగురు మృతి

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో శ‌నివ‌రాం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రి‌గింది. భిల్వారా జిల్లాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ వ్యాన్ ఎదురుగా వ‌స్తున్న‌ ట్రైల‌ర్‌ను బ‌లంగా ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వ‌స‌మ‌య్యింది. అందులో ప్ర‌యాణిస్తున్నవారిలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా, తీవ్రంగా గాయ‌ప‌డిన ముగ్గురు ద‌వాఖాన‌లో మృతిచెందారు. కోటా నుంచి భిల్వారాకు వెళ్తుండ‌గా కేస‌ర్‌పురా వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న బైజోలియా పోలీసులు మృతుల‌ను వ్యాన్‌లోని బ‌య‌టికి తీశారు. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు అందించారు.