ముస్లిం లీగ్ మహిళా విభాగం రద్దుపై బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించాలని కాషాయ పార్టీ డిమాండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనతోనే మహిళా కమిటీని రద్దు చేసినట్టు ముస్లిం లీగ్ తెలిపింది. ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించిన ముస్లిం లీగ్ తాజాగా మహిళా కమిటీని రద్దు చేసి మహిళల వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేసిందని కేంద్ర మంత్రి వీ. మురళీధరన్ అన్నారు.
ముస్లిం లీగ్ మద్దతుతో వయనాద్‌లో గెలిచిన రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం లీగ్ మహిళల గొంతుకను అణిచివేస్తోందని మహిళలను విస్మరిస్తోందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం దాల్చారని నిలదీశారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం ముస్లిం లీగ్ మహిళా హక్కులు, వివక్షపై గొంతెత్తినందుకు ఏకంగా తమ మహిళా విభాగాన్నే రద్దు చేయడం గర్హనీయమని అన్నారు. మహిళా సాధికారతకు అద్దం పట్టే మహిళా కమిటీని తొలగించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- IUML
- Kerala
- Rahul Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

