Viral news | కాబోయే కోడలిని పెళ్లి చేసుకుని మామ జంప్..!
Viral news | ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అలీగఢ్ (Aligarh) కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా.. తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్ (Rampur) లో ఓ వ్యక్తి కాబోయే కోడలును పెళ్లి చేసుకుని జంప్ అయ్యాడు.
Viral news : ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అలీగఢ్ (Aligarh) కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా.. తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్ (Rampur) లో ఓ వ్యక్తి కాబోయే కోడలును పెళ్లి చేసుకుని జంప్ అయ్యాడు. అతడి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులను కొట్టి మరీ పెళ్లి కుమార్తెతో పారిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్‌కు చెందిన షకీల్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశాడు. అప్పటి నుంచి కాబోయే కోడలుతో నిత్యం ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరూ హద్దులు దాటారు. విషయం తెలిసిన కొడుకు ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
షకీల్ భార్య షబానా కూడా తన భర్త తీరును తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో భార్య, కొడుకు ఇద్దరిని కొట్టి.. షకీల్ తనకు కాబోయే కోడలును పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక పెళ్లి కోసం తెచ్చి ఉంచిన నగలు, నగదు ఎత్తుకుని ఆమెతో లేచిపోయాడు. రెండు నెలల క్రితం అలీగఢ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అనిత అనే మహిళ కాబోయే అల్లుడితో లేచిపోయింది. తన కుమార్తె శివానీకి పెళ్లి నిశ్చయం చేసిన ఆమె కాబోయే అల్లుడితో నిత్యం ఫోన్లో మాట్లాడి ప్రేమలో పడింది. పెళ్లి కోసం తెచ్చిపెట్టిన రూ.3.5 లక్షల నగదు, నగలు ఎత్తుకుని బిడ్డకు కాబోయే వాడితో లేచిపోయింది.
Read More >>
ఏక్నాథ్ షిండే అమిత్‌షాకు గుమస్తా : సంజయ్ రౌత్
తరగతి గదుల నిర్మాణం కుంభకోణం.. నేడు ఏసీబీ ముందుకు మనీశ్ సిసోడియా
శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా.. ఏఎక్స్-4 మిషన్‌పై నాసా కీలక అప్డేట్!
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
వీడియో ఫూటేజ్‌లను ధ్వంసం చేయండి.. రాష్ట్రాలకు ఎలక్షన్ కమిషన్ ఆదేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

