ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంకాగాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఘజియాబాద్ జిల్లాలోని సాహిబాబాద్ నియోజకవర్గంలో ప్రియాంకాగాంధీ రోడ్ షో నిర్వహించారు. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఆమె ఓటర్లను ఓట్లడిగారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ త్యాగికి సాహిబాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టుండేది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా రాజీవ్ త్యాగి చేతుల మీదుగా విజయవంతమయ్యేది. అయితే, 2020 ఆగస్టులో రాజీవ్ త్యాగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆయన సతీమణి సంగీతా త్యాగికి సాహిబాబాద్ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో ఇవాళ సంగీతా త్యాగి తరఫున ప్రియాంకాగాంధీ ప్రచారం నిర్వహించారు.
#WATCH | Congress general secretary Priyanka Gandhi Vadra holds a roadshow in Sahibabad, Ghaziabad.
Sangeeta Tyagi, wife of late Congress leader Rajiv Tyagi, who died in August 2020 following a cardiac arrest, is Congress candidate from here.#UttarPradeshElections2022 pic.twitter.com/RYCzOdUUyq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022